5టీవీ న్యూస్ తెలుగు ప్రతినిధి బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని మదీనా కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి ఏడుపు విని స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమికొట్టి బాలికను రక్షించారు.
గాయపడిన చిన్నారిని వెంటనే బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ చికిత్స అందిస్తున్నారు.ఈ ఘటనతో మదీనా కాలనీతో పాటు పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Telangana
బాన్సువాడలో మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి...
Quick Summary:
5TV NEWS TELUGU
