Banswada News
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ భారీ పాదయాత్ర
Quick Summary:
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళన
5టీవీ న్యూస్ బాన్సువాడ : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో శనివారం బాన్సువాడ పట్టణంలో భారీ పాదయాత్ర నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ పాదయాత్రలో ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, పెరుగుతున్న ధరలను అదుపులోకి తేవాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, రైతులు, కార్మికులు, పేద ప్రజల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. సీపీఐ సీనియర్ నాయకుడు దుబ్బాస్ రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దుబాస్ రాములు, డి.శంకర్, శ్రీనివాస్, గంగాధర్, ఎల్లయ్య, అబ్రహం, సర్దార్, అశోక్ గౌడ్, శివాజీ, అడబల్లి రాజు, పోశెట్టి, మాధవరావు, బసవంతరావు తదితరులు పాల్గొన్నారు.
