Sun, Aug 09, 2026
YouTube
Rivx Studios
News Thumb కమీషన్ల కోసం ప్రయివేట్ అంబులెన్స్‌ల కక్కుర్తి. News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బాన్సువాడలో మళ్లీ వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు News Thumb నస్రుల్లాబాద్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక News Thumb కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ భారీ పాదయాత్ర News Thumb రోడ్డు పై సూచిక బోర్డులు ఎక్కడ ?... News Thumb గ్యాస్ సిలిండర్‌కు బ్లాక్ రేటు.. రూ.2,000 వసూలు. News Thumb వర్షాభావ పరిస్థితులపై అధికారులతో ఎమ్మెల్యే పోచారం సమీక్ష News Thumb ఫ్యామిలీ సర్టిఫికెట్ల జారీపై మాజీ వార్డు సభ్యుడు అక్బర్ ఆగ్రహం News Thumb బాన్సువాడలో ఘనంగా ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలు. News Thumb ప్రధానిపై అనుచిత పోస్టర్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బీజేపీ వినతి. News Thumb రిపుల్స్ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలి News Thumb 13వ వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహణ. News Thumb విద్యార్థుల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పోచారం News Thumb లా విద్యార్థులకు ప్రథమ బహుమతి. News Thumb శ్రీ చైతన్య పాఠశాలకు ఇచ్చిన నోటీసుల గడువు నేటితో ముగింపు. News Thumb ఆశన్న మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు: రజినీకాంత్ News Thumb ప్రొఫెసర్ జయశంకర్‌కు బీజేపీ ఘన నివాళి. News Thumb కమీషన్ల కోసం ప్రయివేట్ అంబులెన్స్‌ల కక్కుర్తి. News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బాన్సువాడలో మళ్లీ వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు News Thumb నస్రుల్లాబాద్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక News Thumb కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ భారీ పాదయాత్ర News Thumb రోడ్డు పై సూచిక బోర్డులు ఎక్కడ ?... News Thumb గ్యాస్ సిలిండర్‌కు బ్లాక్ రేటు.. రూ.2,000 వసూలు. News Thumb వర్షాభావ పరిస్థితులపై అధికారులతో ఎమ్మెల్యే పోచారం సమీక్ష News Thumb ఫ్యామిలీ సర్టిఫికెట్ల జారీపై మాజీ వార్డు సభ్యుడు అక్బర్ ఆగ్రహం News Thumb బాన్సువాడలో ఘనంగా ఎంపీ సురేష్ షెట్కర్ జన్మదిన వేడుకలు. News Thumb ప్రధానిపై అనుచిత పోస్టర్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు బీజేపీ వినతి. News Thumb రిపుల్స్ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలి News Thumb 13వ వార్డులో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహణ. News Thumb విద్యార్థుల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పోచారం News Thumb లా విద్యార్థులకు ప్రథమ బహుమతి. News Thumb శ్రీ చైతన్య పాఠశాలకు ఇచ్చిన నోటీసుల గడువు నేటితో ముగింపు. News Thumb ఆశన్న మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటు: రజినీకాంత్ News Thumb ప్రొఫెసర్ జయశంకర్‌కు బీజేపీ ఘన నివాళి.
తాజా వార్తలు
కమీషన్ల కోసం ప్రయివేట్ అంబులెన్స్‌ల కక్కుర్తి. - Rivx Studios
Banswada News

కమీషన్ల కోసం ప్రయివేట్ అంబులెన్స్‌ల కక్కుర్తి.

Published on August 9, 2026 at 10:04 AM

0 Views

News Image
Quick Summary:

కమీషన్‌ కోసం.. ప్రాణాలతో చెలగాటం.అంబులెన్స్‌ మాఫియా...ఆస్పత్రులకు కమీషన్‌ బాట

5టీవీ న్యూస్ బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో ప్రైవేట్‌ అంబులెన్స్‌ నిర్వాహకులు, డ్రైవర్ల వ్యవహారశైలిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రులకు వచ్చే రోగులను కమీషన్ల కోసం తమకు అనుకూలమైన ప్రైవేట్‌ ఆస్పత్రులకు తరలిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎంసీహెచ్‌ ఆస్పత్రి పరిసరాల్లో ప్రైవేట్‌ అంబులెన్స్‌లు పెద్ద సంఖ్యలో కనిపిస్తుండటంతో ఈ వ్యవహారంపై చర్చ జరుగుతోంది.

రోగి దొరికితే చాలు...

అత్యవసర పరిస్థితుల్లో రోగిని ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చినప్పుడు కొందరు అంబులెన్స్‌ డ్రైవర్లు, నిర్వాహకులు కుటుంబ సభ్యుల నిర్ణయాలను పక్కనపెట్టి తమకు అనుకూలమైన ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిజామాబాద్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లోని కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులతో సంబంధాలు ఏర్పరచుకుని కమీషన్ల కోసం రోగులను తరలిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

రూ.10 వేల వరకు కమీషన్‌...

బాన్సువాడ పట్టణ పరిధిలో సుమారు 20 వరకు ప్రైవేట్‌ అంబులెన్స్‌లు ఉన్నట్లు సమాచారం. కొందరు నిర్వాహకులు ప్రైవేట్‌ ఆస్పత్రులతో ఒప్పందాలు చేసుకుని ఒక్కో రోగిని తరలించినందుకు భారీగా కమీషన్లు పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో కేసుకు రూ.10 వేల వరకు కమీషన్‌ తీసుకుంటున్నారన్న ప్రచారం ఉన్నప్పటికీ దీనిపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

కరోనా సమయంలో మొదలైందా...

కరోనా సమయంలో అత్యవసర సేవల్లో అంబులెన్స్‌ డ్రైవర్లు కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయాలను ఆసరాగా చేసుకుని కొందరు ప్రైవేట్‌ ఆస్పత్రులు రోగులను తమ వద్దకు తరలించేలా అంబులెన్స్‌ నిర్వాహకులతో సంబంధాలు ఏర్పరచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఇదే వ్యవహారం కమీషన్ల దందాగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు.

ముందస్తు ఒప్పందాలపై ఆరోపణలు

కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు అంబులెన్స్‌ నిర్వాహకులకు ముందుగానే డబ్బులు చెల్లించి తమ ఆస్పత్రులకు రోగులను తీసుకురావాలని ఒప్పందాలు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను అధికారులు పరిశీలించాల్సి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వకుండా రోగులను నిర్దిష్ట ఆస్పత్రులకు తీసుకెళ్తే బాధిత కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పర్యవేక్షణ ఏదీ...

అంబులెన్స్‌లలో ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ వంటి అత్యవసర సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా? వాటిని నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందికి ప్రాథమిక వైద్య పరిజ్ఞానం ఉందా? అత్యవసర సమయంలో రోగికి అవసరమైన ప్రథమ చికిత్స అందిస్తున్నారా? అనే అంశాలపై సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం : ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాస్

ప్రైవేట్‌ అంబులెన్స్‌ల వ్యవహారంపై ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా.. ప్రైవేట్‌ అంబులెన్స్‌ల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. నిబంధనలు ఉల్లంఘించే అంబులెన్స్‌ డ్రైవర్లపై చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com