Banswada News
బాన్సువాడలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ వేడుకలు
Quick Summary:
66వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ
5టీవీ న్యూస్ బాన్సువాడ : భారత జాతీయ యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవాన్ని బాన్సువాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ మన్సూర్ ఆధ్వర్యంలో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. 1960 ఆగస్టు 9న ప్రారంభమైన యువజన కాంగ్రెస్ నేటికీ దేశంలోని కోట్లాది మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. నేడు యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగమని, పేపర్ లీకేజీలు, ధరల పెరుగుదల, రైతుల సమస్యలపై యువజన కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ప్రజల తరఫున ప్రశ్నిస్తోందన్నారు.స్వర్గీయ ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ చూపిన బాటలో, రాహుల్‌గాంధీ ఆశయాలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువత సమస్యల పరిష్కారం కోసం యువజన కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నాందేవ్, తడ్కోల్ గ్రామ సర్పంచ్ అందే రమేష్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఖమర్ సుల్తానా గౌస్ పాషా , బొంగు ఉల్లవ్వ, గంగారాం, యువ నాయకులు సయ్యద్ ఇలియాస్, భూపతి, నోమన్ తదితరులు పాల్గొన్నారు.
