Banswada News
లయన్ బాబురావు జన్మదినోత్సవం.. అయ్యప్ప ఆలయం వద్ద అన్నదాన సేవ
Quick Summary:
బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదానం.
మోసిన్ 5 టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : లయన్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు జన్మదినాన్ని పురస్కరించుకొని బాన్సువాడలోని అయ్యప్ప ఆలయం వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు, నిరుపేదలకు, ప్రయాణికులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు పాత బాలకృష్ణ మాట్లాడుతూ, సమాజ సేవే లయన్స్ క్లబ్ ప్రధాన ధ్యేయమని, ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. లయన్ బాబురావు సేవా స్ఫూర్తితో వైద్యం, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సేవాభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు పాత బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఖలీద్, కోశాధికారి విట్టల్ రెడ్డి, ప్రోగ్రాం చైర్మన్ అంజిరెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి కాసం శ్రీనివాస్, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ బెజిగం వెంకటరమణ, సభ్యులు కోటి హరినాథ్, చిదుర వినయ్ తదితరులు పాల్గొన్నారు.