Banswada News
రూ.21 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.
Quick Summary:
బాన్సువాడలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేత.
మోసిన్ 5 టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్ రూ.21 లక్షల విలువైన చెక్కులను 21 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలపై వివాహ ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.సంక్షేమ పథకాల ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తోందని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్వాల కృష్ణ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వాహబ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఖామర్ సుల్తానా గౌస్ పాషా, కాజీమ్ కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
