Mon, Aug 03, 2026
YouTube
Rivx Studios
News Thumb హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం. News Thumb 13వ వార్డు టీచర్స్ కాలనీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి... News Thumb పచ్చదన పరిరక్షణే లక్ష్యం... News Thumb కాకతీయ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb తాడ్కోల్ డబుల్ బెడ్‌రూం కాలనీలో బోనాల సంబరాలు... News Thumb బోనాల వేడుకల్లో పాల్గొన్న పోచారం, కాసుల బాలరాజ్. News Thumb కామారెడ్డిలో ఆధునిక ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ ప్రారంభం. News Thumb శాంతాపూర్‌లో అన్నాభావు సాఠే 106వ జయంతి. News Thumb మంజీరా చెక్‌డ్యాం నీటితో రైతుల్లో ఆనందం.. News Thumb వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు... News Thumb విద్యే భవిష్యత్తుకు పునాది.. డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి... News Thumb 5టీవీ న్యూస్ కథనానికి స్పందన... నిర్లక్ష్య సిబ్బందిపై చర్యలు తప్పవన్న సూపరిండెంట్. News Thumb కుక్కల దాడుల నేపథ్యంలో చర్యలు.. ప్రత్యేక బృందాలతో పట్టివేత ప్రారంభం News Thumb ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్.. నగదు, బైకులు, సెల్‌ఫోన్లు స్వాధీనం News Thumb వీధి కుక్కలు, కోతుల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు బాగువాన్ కమిటీ వినతి. News Thumb ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం... News Thumb పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. News Thumb మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి. News Thumb 11 మంది చిన్నారులు, ఓ మహిళపై కుక్కల దాడి...మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన. News Thumb కుక్కలు, కోతుల బెడుద నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ. News Thumb హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం. News Thumb 13వ వార్డు టీచర్స్ కాలనీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి... News Thumb పచ్చదన పరిరక్షణే లక్ష్యం... News Thumb కాకతీయ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb తాడ్కోల్ డబుల్ బెడ్‌రూం కాలనీలో బోనాల సంబరాలు... News Thumb బోనాల వేడుకల్లో పాల్గొన్న పోచారం, కాసుల బాలరాజ్. News Thumb కామారెడ్డిలో ఆధునిక ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ ప్రారంభం. News Thumb శాంతాపూర్‌లో అన్నాభావు సాఠే 106వ జయంతి. News Thumb మంజీరా చెక్‌డ్యాం నీటితో రైతుల్లో ఆనందం.. News Thumb వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు... News Thumb విద్యే భవిష్యత్తుకు పునాది.. డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి... News Thumb 5టీవీ న్యూస్ కథనానికి స్పందన... నిర్లక్ష్య సిబ్బందిపై చర్యలు తప్పవన్న సూపరిండెంట్. News Thumb కుక్కల దాడుల నేపథ్యంలో చర్యలు.. ప్రత్యేక బృందాలతో పట్టివేత ప్రారంభం News Thumb ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్.. నగదు, బైకులు, సెల్‌ఫోన్లు స్వాధీనం News Thumb వీధి కుక్కలు, కోతుల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు బాగువాన్ కమిటీ వినతి. News Thumb ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం... News Thumb పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. News Thumb మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి. News Thumb 11 మంది చిన్నారులు, ఓ మహిళపై కుక్కల దాడి...మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన. News Thumb కుక్కలు, కోతుల బెడుద నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ.
తాజా వార్తలు
హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం. - Rivx Studios
Banswada News

హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం.

Published on August 3, 2026 at 12:56 PM

1,390 Views

Quick Summary:

బాన్సువాడ నియోజకవర్గ ఆసుపత్రులకు నిధులు, సౌకర్యాలు కోరిన ఎమ్మెల్యే పోచారం.

5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవల నాణ్యతపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.ఈ సమావేశంలో గర్భిణీ స్త్రీలు, శిశు ఆరోగ్యం, టీకా కార్యక్రమాలు, వ్యాధుల నివారణ చర్యలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.బాన్సువాడ నియోజకవర్గంలో నిర్మాణ దశలో ఉన్న, పూర్తి కావస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన అదనపు నిధులు మంజూరు చేయాలని, ఆసుపత్రుల్లో ఔషధాల లభ్యత, మౌలిక వసతులు, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరతను వెంటనే భర్తీ చేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి పోచారం శ్రీనివాస్ రెడ్డి తీసుకెళ్లారు.అలాగే నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పలు ప్రతిపాదనలు సమర్పించారు.

ప్రధాన ప్రతిపాదనలు...

చందూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) నిర్మాణం పూర్తి చేసేందుకు అదనంగా రూ.40 లక్షలు మంజూరు చేయాలి.

వర్ని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలిసిస్ సెంటర్ ఏర్పాటు చేసి కిడ్నీ రోగులకు చికిత్స అందించాలి.

వర్ని ఆసుపత్రికి అవసరమైన వైద్య, పారామెడికల్ సిబ్బంది, ఆధునిక పరికరాలు మంజూరు చేయాలి.

నిర్మాణం పూర్తికి చేరుకున్న కోటగిరి 50 పడకల ఆసుపత్రికి సిబ్బంది, పరికరాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలి.

తుది దశలో ఉన్న బాన్సువాడ 100 పడకల ఏరియా ఆసుపత్రికి ఆధునిక వైద్య పరికరాలు, ఐసీయూ, ల్యాబ్ పరికరాలు, ఫర్నిచర్ మంజూరు చేయాలి.

బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రి (MCH), ఏరియా ఆసుపత్రి (AH)లో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సమావేశంలో మంత్రి దామోదర్ రాజనరసింహ బాన్సువాడ నియోజకవర్గ ఆసుపత్రుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
Verified Staff Journalist admin admin@rivxstudios.com