Banswada News
బోనాల వేడుకల్లో పాల్గొన్న పోచారం, కాసుల బాలరాజ్.
Quick Summary:
అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.
5 టీవీ న్యూస్ ప్రతినిధి, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని కోట దుర్గామాత ఆలయం, సాయికృపా నగర్ కాలనీలో ఆదివారం ఘనంగా నిర్వహించిన బోనాల మహోత్సవాల్లో రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ సంస్థ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అమ్మవారిని దర్శించుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సిరిసంపదలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, గురువినయ్ స్వామి, మాజీ ఏఎంసీ చైర్మన్ నార్ల రవీందర్, నార్ల సురేష్, ఎజాస్, కౌన్సిలర్ ఖలేఖ్, లింగం, హకీమ్, నర్సన్న చారి, దాసరి శ్రీనివాస్, కొట్టం గంగాధర్, స్థానిక కౌన్సిలర్ జంగం రాజశేఖర్, కో-ఆప్షన్ సభ్యులు ఖమర్ సుల్తానా గౌస్,మజ్జు,ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
