5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న వీధి కుక్కలు, కోతుల బెడదను వెంటనే నియంత్రించాలని కోరుతూ బాగువాన్ కమిటీ సభ్యులు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ గోవు గంగాధర్ కు వినతిపత్రం అందజేశారు.
బాన్సువాడ పట్టణంలోని పలు కాలనీల్లో వీధి కుక్కలు చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని వారు తెలిపారు. అలాగే కోతుల సంచారంతో ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలు, పండ్లు ధ్వంసం చేయడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని వివరించారు.
ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వీధి కుక్కలు, కోతులను పట్టుకుని ప్రజలకు ఉపశమనం కల్పించాలని కమిటీ సభ్యులు కమిషనర్‌ను కోరారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బాగువాన్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ కాజీమ్, ఉపాధ్యక్షుడు ఫాజిల్, సాభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Banswada News
వీధి కుక్కలు, కోతుల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు బాగువాన్ కమిటీ వినతి.
Quick Summary:
కుక్కలు, కోతుల బెడదకు చెక్ పెట్టాలి.. బాగువాన్ కమిటీ డిమాండ్.