Banswada News
గుంతలతో ప్రమాదకరంగా మారిన రహదారి... పూడ్చిన బీఆర్ఎస్ నాయకులు
Quick Summary:
గుంతలను పూడ్చి ఆదర్శం...
5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా బాన్సువాడ పట్టణంలోని రహదారులపై పెద్దఎత్తున గుంతలు ఏర్పడి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఫెరోజ్ ఖాన్, మాజీ కౌన్సిలర్, మాజీ వార్డు సభ్యుడు అక్బర్, ముందుకు వచ్చి రోడ్డుపై ఉన్న గుంతలను డస్ట్ మిశ్రమంతో పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు.రోడ్ల దుస్థితి కారణంగా ప్రతిరోజూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు. వర్షాలు తగ్గిన వెంటనే దెబ్బతిన్న రహదారులకు శాశ్వత మరమ్మతులు చేపట్టి నాణ్యమైన రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. తాము చేపట్టింది కేవలం ప్రజలకు ఇబ్బందులు తగ్గించేందుకు తాత్కాలిక చర్య మాత్రమేనని, అధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో రోడ్లను మరమ్మతు చేయాలని కోరారు.ఈ సేవా కార్యక్రమాన్ని స్థానికులు అభినందిస్తూ, ప్రజల సమస్యలను గుర్తించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.