Banswada News
బాన్సువాడలో దోమల నివారణకు ఫాగింగ్
Quick Summary:
వర్షాకాలంలో వ్యాధుల నియంత్రణకు మున్సిపాలిటీ చర్యలు
5టీవీ న్యూస్ బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో దోమల బెడదను నివారించేందుకు మున్సిపల్ అధికారులు సోమవారం ఫాగింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో దోమల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఫాగింగ్ నిర్వహిస్తున్నారు.మున్సిపాలిటీకి చెందిన ఫాగింగ్ వాహనం ద్వారా ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు, మార్కెట్ పరిసరాలు, మురుగు కాలువలు, నీరు నిలిచే ప్రాంతాల్లో దోమల నివారణ ఫాగింగ్ చేశారు. ఫాగింగ్ సమయంలో భారీగా పొగ వెలువడటంతో ఆయా ప్రాంతాల్లో కొద్దిసేపు పొగమంచు మాదిరి వాతావరణం కనిపించింది.