5టీవీ న్యూస్ బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం పరిశీలించారు. కళాశాల ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు.అనంతరం డిజిటల్ క్లాస్‌రూమ్‌లను పరిశీలించారు.విద్యార్థులకు అందుతున్న డిజిటల్ బోధనా విధానాలపై అధ్యాపకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్కులను పంపిణీ చేశారు.
నూతన బోధనా పద్ధతులు అలవర్చుకోవాలి...
ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న అధ్యాపకులను ఉద్దేశించి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా అధ్యాపకులు నూతన బోధనా పద్ధతులను అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, వారి భవిష్యత్తుకు సరైన మార్గనిర్దేశం చేసేలా బోధన సాగాలని అన్నారు.అధ్యాపకులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థినులను కలెక్టర్ అభినందించారు.
కళాశాల వాతావరణంపై ప్రశంస...
కళాశాల ప్రాంగణం పరిశుభ్రంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండటాన్ని కలెక్టర్ ప్రశంసించారు. కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్న జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం సేవలను అభినందించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం మెమొంటో, శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్,మున్సిపల్ కమీషనర్ గోవు గంగాధర్, ఎంపీడీవో ఆనంద్,కళాశాల డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు మహమ్మద్ ఎజాస్, దాసరి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ అసద్ ఫారుఖ్, లింగంపేట్ ప్రిన్సిపాల్ నరేందర్, బాన్సువాడ జూనియర్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ యాదగౌడ్, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Banswada News
ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్.
Quick Summary:
ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ పరిశీలన...డిజిటల్ క్లాస్‌రూమ్‌ల తనిఖీ..

