Banswada News
పింఛన్ లబ్ధిదారులకు మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్.
Quick Summary:
మున్సిపల్ కమీషనర్ గోవు గంగాధర్.
5టీవీ న్యూస్ బాన్సువాడ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలో అర్హులైన లబ్ధిదారుల నుంచి వివిధ రకాల పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ గోవు గంగాధర్తె లిపారు. వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ చేయించుకుంటున్న అర్హులైన వారు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను కూడా నమోదు చేస్తున్నట్లు తెలిపారు.అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని వారు బాన్సువాడ పురపాలక సంఘ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు సంబంధిత పత్రాలను కార్యాలయంలో సమర్పించాలని కోరారు.పింఛన్ దరఖాస్తుదారుల అవసరాలు, సందేహాల పరిష్కారం కోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.