5టీవీ న్యూస్ బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కార్యాలయం వద్ద సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ లతీఫ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు.
ఈ సందర్భంగా సయ్యద్ లతీఫ్ మాట్లాడుతూ దేశ అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు సమాజానికి సరైన సమాచారాన్ని అందించడంలో జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం ప్రెస్ క్లబ్ సభ్యులకు, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు సాయిగౌడ్, మోయిన్, సుధాకర్, శ్రీకాంత్ రెడ్డి, గోపాల్, సాయిరెడ్డి, ఖాలేక్, అంబిల్‌పూర్ రాజు, రమణ, సుధాకర్ గౌడ్, మధు రెడ్డి, పండరి గౌడ్, హైమద్, పోచిరాం, చందు, శ్రీను, నబీ, ఆనంద్, శ్రీనివాస్, సతీష్, ప్రదీప్, రాజేష్, హనుమాన్లు, సతీష్ గౌడ్, నరేష్ గౌడ్, ప్రమోద్ రెడ్డి, యూనుస్, రషీద్, సలీం, మహేష్, అశోక్, సతీష్, లక్ష్మణ్, మహేష్, సుభాష్, జాకీర్, రవీందర్ గౌడ్, ఇలియాస్ తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.
Banswada News
ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
Quick Summary:
జాతీయ జెండాను ఆవిష్కరించిన సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ లతీఫ్.
